ఆహారం కోసం రోడ్లపైకి వస్తున్న చుక్కల జింకల రక్షణకు చర్యలు
రిపోర్టర్: రమేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం కంబాలకొండ అటవీ ప్రాంతం నుంచి చుక్కల జింకలు ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి జగదీష్ తెలిపారు. తగినంత గ్రాసం దొరక్కపోవడంతో జింకలు రోడ్లపైకి వచ్చి వాహనాల కిందపడి ప్రాణాలు కోల్పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎండాడ రోడ్డులో ఇప్పటికే సగం వరకు కంచె నిర్మించామని, మిగిలిన ప్రాంతంలో నిధులు రాగానే కంచె ఏర్పాటు చేసి వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని జగదీష్ స్పష్టం చేశారు.