వర్షాభావ పరిస్థితులపై కేంద్రం తక్షణమే సాయం అందించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాభావం, పంటల సాగు లోటుపై శాసనసభలో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో 20 శాతం వర్షపాతం లోటు ఏర్పడటంతో 33 జిల్లాల్లో 19 జిల్లాలు వర్షాభావ కేటగిరీలో ఉన్నాయని తెలిపారు. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు భారీగా పడిపోవడంతో పాటు సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ నేపథ్యంలో ఎల్‌నినో పరిస్థితుల అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది.