ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించిన సంగారెడ్డి ప్రత్యేక అవసరాల విద్యార్థులు

రిపోర్టర్: సురేష్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లాకు చెందిన 130 మందికి పైగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు స్ఫూర్తి పొందారు. సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో ఐఐటీ డైరెక్టర్ ప్రొ. బి.ఎస్. మూర్తి విద్యార్థులతో ముచ్చటించి, పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా పది వేల మందికి పైగా విద్యార్థులు ఐఐటీని సందర్శించడం విశేషం.