తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్నారైల సేవలు మరువలేనివి: మంత్రి కొండపల్లి
రిపోర్టర్: సురేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎన్టీఆర్, చంద్రబాబుల పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ అధ్యక్షుడిగా డా. గురు రాజా నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ, విదేశాల నుంచి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.