పదవి కోసం అర్ధరాత్రి పెళ్లి: టీడీపీ నేత వ్యూహం బెడిసికొట్టిన వైనం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Saluru

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ నేత వైకుంఠపు హర్షవర్ధన్ తన ప్రేయసి మంజీరను అత్యవసరంగా వివాహం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో హర్షవర్ధన్ ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్డీయే కూటమి సీట్ల సర్దుబాటులో ఆ స్థానం జనసేనకు కేటాయించడంతో ఆయన ఆశలు ఆవిరయ్యాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.