అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేతపై కావలి మాజీ కౌన్సిలర్ ఆవేదన
రిపోర్టర్: సునీల్
స్థలం: కావలి
కావలి పట్టణంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా దశాబ్దాల నాటి చెట్లను విచ్చలవిడిగా నరికివేయడంపై మాజీ కౌన్సిలర్ బిట్రగుంట శివప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలోని జర్నలిస్ట్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రహదారికి అడ్డంకిగా లేని సుమారు 40 ఏళ్ల నాటి చెట్లను తొలగించడం సరికాదన్నారు. అభివృద్ధి పనులను తాము స్వాగతిస్తున్నామని, అయితే అధికారులు పర్యావరణ పరిరక్షణకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.