రైతు సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాల కృషి
రిపోర్టర్: Ajay
స్థలం: మల్యాల
రైతు సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన ధ్యేయమని, రైతులకు సకాలంలో రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని నూకపెల్లి, పోతారం సింగిల్ విండో చైర్మన్లు స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపెల్లి సింగిల్ విండో చైర్మన్ నేరెళ్ల సతీష్ రెడ్డి, పోతారం సింగిల్ విండో చైర్మన్ కొల్లూరు గంగాధర్ లు కేడీసీసీబీ బ్యాంకు సీఈఓ సత్యనారాయణరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు.