బీసీసీఐ అసోసియేట్ పార్ట్‌నర్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ChatGPT
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
భారత క్రికెట్‌లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ChatGPT అధికారికంగా అడుగుపెట్టింది. క్యాంపా, ఎస్బీఐ లైఫ్‌లతో కలిసి టీమ్ ఇండియా హోమ్ క్రికెట్‌కు అసోసియేట్ పార్ట్‌నర్‌గా బీసీసీఐ దీనిని ఎంపిక చేసింది. రెండు సీజన్ల పాటు సాగే ఈ ఒప్పందం విలువ రూ.130 కోట్లకు పైగా ఉంటుందని, 2028 మార్చి వరకు ఇది కొనసాగుతుందని బీసీసీఐ వెల్లడించింది.