పట్టణ ప్రాంతాల అభివృద్ధికి యాభై వేల కోట్ల ప్రణాళిక
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Kuppam
పట్టణ ప్రాంతాల్లో యాభై వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కుప్పంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ భారీ నిధులతో చేపట్టే పనులు రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ ఛేంజర్‌గా మారుతాయని స్పష్టం చేశారు. అర్బన్ ప్రాంతాల రూపురేఖలను మార్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.