చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

గోదావరి వరద జలాలతో ఐదు జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, రెండు లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణకు ఉపకరించే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఉత్తర్వులతో ఊరట లభించిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని, కేంద్రం తాజాగా జారీ చేసిన మెమోతో పర్యావరణ అనుమతుల సాధనకు అడ్డంకులు తొలగిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.