నెల్లూరులో రౌడీషీటర్లు హిజ్రా ముఠాల దందాలపై పోలీసుల నిఘా కొరవడింది
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయని, వారి ఆర్థిక మూలాలపై పోలీసులు దృష్టి సారించకపోవడం వల్లే ప్రేమ్చందు వంటి హత్యలు పునరావృతమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. హిజ్రా ముఠాలు వడ్డీ వ్యాపారాల పేరుతో రౌడీషీటర్లను అడ్డుపెట్టుకుని దందాలు, దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కేవలం నామమాత్రపు కౌన్సెలింగ్లతో సరిపెట్టకుండా నేరాల మూలాలను పెకిలించి వేయాలని ప్రజలు కోరుతున్నారు.