మంచిర్యాలలో కార్మికుల ఐక్యతా నినాదాలతో హోరెత్తిన ఏఐటీయూసీ ఆవిర్భావ సంబరాలు
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ నూట ఏడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించగా కార్మిక సంఘం నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కార్మికుల ఐక్యతే బలం, పోరాటమే హక్కుల సాధనకు మార్గమని ఆయన తెలిపారు.