క్రేజీ కల్యాణం సినిమా ప్రతి ఒక్కరి జీవితాలకు దగ్గరగా ఉంటుంది: అఖిల్‌రాజ్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
క్రేజీ కల్యాణం చిత్రంలోని ఉదయ్ పాత్ర నాకు చాలా నచ్చిందని, ఈ సినిమా ప్రతి ఇంటిలో జరిగే కథలా ఉంటుందని హీరో అఖిల్ రాజ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, దర్శకుడు భద్రప్ప తనకు పూర్తి స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఈ నెల పదహారున ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆయన స్పష్టం చేశారు.