భక్తిశ్రద్ధలతో వినాయక మండపాలను సందర్శించిన బీజేపీ నేత ఉషా రాజు

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

కపటి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను బీజేపీ మండల అధ్యక్షుడు బి. ఉషా రాజు వాల్మీకి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి, వేడుకల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. కమిటీ సభ్యులకు తన వంతుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.