నడిరోడ్డుపై డ్రగ్స్ కొనుగోలు చేసిన హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్

రిపోర్టర్: రాము స్థలం: పంజాబ్

పంజాబ్ రాష్ట్రంలోని జలాలాబాద్‌లో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అమన్‌దీప్ సింగ్ నడిరోడ్డుపై డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఉధమ్ సింగ్ చౌక్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి సేవించినట్లు తేలడంతో, ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.