ఎరిథ్రిటాల్తో గుండెపోటు వచ్చే అవకాశం ఉందన్న వైద్య నిపుణులు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
కృత్రిమ తీపి పదార్థం ఎరిథ్రిటాల్ వినియోగంపై వైద్య నిపుణులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ల్యాబ్ పరీక్షల్లో ఎరిథ్రిటాల్ ప్లేట్లెట్ కార్యకలాపాలను పెంచుతుందని, దీనివల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇప్పటికే గుండె జబ్బులు, షుగర్, ఊబకాయం ఉన్నవారు ప్రాసెస్ చేసిన షుగర్ ఫ్రీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని గ్లెనీగల్స్ హాస్పిటల్స్ కార్డియాలజిస్టులు స్పష్టం చేశారు. ముందుగా భయపడకుండా వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.