జిబూటి తీరంలో పడవ బోల్తా ఘటన: 109 మంది దుర్మరణం
రిపోర్టర్: హరి
స్థలం: జిబూటి
ఆఫ్రికాలోని జిబూటి నుంచి యెమెన్‌కు వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో పదిహేను మంది పిల్లలతో సహా మొత్తం నూట తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. జిబూటిలోని గుహెరే ప్రాంతానికి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో వంద మందికి పైగా గల్లంతు కాగా, ఎనభై మందికి పైగా ఇథియోపియా పౌరులు సురక్షితంగా బయటపడ్డారని, గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సమాచారం.