కొమ్మిక పంచాయతీలో ఎన్నికల సమయంలో పటిష్ట భద్రత కల్పించాలి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీలో ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు, రిగ్గింగ్ జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త అర్జున్ రెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు. గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలను ప్రత్యక్షంగా చూశానని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాలు చోటుచేసుకుంటే ఆధారాలతో కూడిన వీడియోలను బయటపెడతానని మీడియా సమావేశంలో తెలిపారు.