నిర్మల్ జిల్లాలో కలెక్టర్ భవేశ్ మిశ్రా పర్యటన: అధికారులకు కీలక ఆదేశాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: నిర్మల్
నిర్మల్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు మరియు క్రీడా కేంద్రాలను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కడెం మండలం కొత్త మద్దిపడగ సదర్మాట్ బ్యారేజీ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించాలని మరియు వైద్య సేవలను పటిష్టం చేయాలని అధికారులను కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.