బాన్స్వాడ గణేష్ నిమజ్జనానికి రెండు వందల పోలీసులతో పటిష్ట భద్రత
రిపోర్టర్: గోపి
స్థలం: కామారెడ్డి
బాన్స్వాడలో గణేష్ నిమజ్జన వేడుకల నిమిత్తం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ కామారెడ్డి వెల్లడించారు. ఈ వేడుకల భద్రత కోసం రెండు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వంద సీసీటీవీ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు. మూడు సెక్టర్లు, పది పికెట్లు, ఏడు స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించామన్నారు. ఎలాంటి డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ, ప్రజలందరూ ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు.