క్రేజీ కల్యాణం సినిమా విశేషాలు పంచుకున్న హీరో అఖిల్ రాజ్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
అనుపమ పరమేశ్వరన్ తో కలిసి నటించాలన్న తన తల్లి కోరిక ‘క్రేజీ కల్యాణం’ సినిమాతో నెరవేరిందని హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి తెలిపారు. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను ఆయన మీడియాకు వివరించారు. నరేశ్ విజయకృష్ణ, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా కుటుంబమంతా కలిసి ఆస్వాదించేలా ఉంటుందని బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర విశేషాలను పంచుకుంటూ అఖిల్ రాజ్ స్పష్టం చేశారు.