నెల్లూరులో ఓటర్లకు కాంగ్రెస్ అభ్యర్థి వినూత్న ప్రలోభం: ఒక్కో స్లిప్పునకు కేజీ చికెన్ ఫ్రీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: నెల్లూరు

నెల్లూరులో మున్సిపల్ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఓటరు చీటీలతో పాటు ఏకంగా కేజీ చికెన్ ఉచితంగా పంపిణీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏపీ వ్యాప్తంగా నేడు తొంబై రెండు పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.