హాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర విషయాలు పంచుకున్న దిశా పటాని

రిపోర్టర్: వెంకట్ స్థలం: ముంబై

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హోలీగార్డ్స్ సాగా ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ అనే హాలీవుడ్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో జెస్సికా అనే కీలక పాత్ర పోషిస్తున్న ఆమె, ఆడిషన్ నుంచి షూటింగ్ వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదించినట్లు తెలిపారు. గ్లామర్ అనేది వృత్తిలో ఒక భాగం మాత్రమేనని, నటిగా తన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.