తల్లి సమాధి వద్దే బాలుడి పుట్టినరోజు వేడుక: చలించిపోయిన స్థానికులు
రిపోర్టర్: సురేష్
స్థలం: కొల్లాపూర్
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలకు చెందిన ఆర్యన్ అనే బాలుడు తన తల్లి సమాధి వద్దే పుట్టినరోజు వేడుకను జరుపుకున్నట్లు తండ్రి గోవింద్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చిలో అనారోగ్యంతో తల్లి వనజారెడ్డి మృతి చెందడంతో, బాలుడు ఫంక్షన్ హాల్ వేడుకలను రద్దు చేసుకుని వ్యవసాయ పొలంలోని సమాధి వద్ద పూలతో అలంకరించి కేక్ కట్ చేసి నిరాడంబరంగా బర్త్‌డే నిర్వహించుకున్నట్లు ఆయన కన్నీటిపర్యంతమవుతూ వివరించారు.