చేనేత కార్మికులకు కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 15,521 మంది దరఖాస్తు చేసుకోగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతోంది. లంచాలు వసూలు చేసే మధ్యవర్తులను నమ్మవద్దని, పైసా వసూలు చేసినా సహించేది లేదని చేనేత జౌళిశాఖ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించారు.