రాష్ట్రంలో తీవ్ర కరువు నేపథ్యంలో దీపావళి వేడుకలు రద్దు: రాజ్ థాకరే ప్రకటన
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
మహారాష్ట్రలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది ముంబైలోని శివాజీ పార్క్ లో దీపోత్సవ వేడుకలను నిర్వహించడం లేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే స్పష్టం చేశారు. కరవుతో రైతులు అల్లాడుతుంటే వేడుకలు జరపడం తగదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాభావం కారణంగా ఎనుబది ఐదు శాతం ప్రాంతాలు కరువు బారిన పడ్డాయని రాజ్ థాకరే తెలిపారు.