మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం అత్తాకోడళ్లు మృతి

రిపోర్టర్: మహేష్ స్థలం: విశాఖపట్నం

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన అత్తాకోడళ్లు రమాదేవి, బొమ్మలి నేహలు దుర్మరణం చెందారు. పాయింట్ కుక్ ప్రాంతంలో మితిమీరిన వేగంతో వచ్చిన పోర్షే కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. విశాఖ సీతమ్మధారకు చెందిన ఈ కుటుంబంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.