రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానం
రిపోర్టర్: నరేష్
స్థలం: నెల్లూరు
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం వినూత్న విధానాన్ని తెచ్చింది. రేషన్ బియ్యం నాణ్యతతో పాటు రవాణాలో పారదర్శకత కోసం ప్రతి బస్తాకు క్యూఆర్‌కోడ్ ఏర్పాటు చేసింది. గోదాముల నుంచి చౌకదుకాణాల వరకు ప్రతి దశలోనూ ఈ కోడ్‌ను స్కాన్ చేయాలని ఆదేశించింది. దీనివల్ల బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయనే పూర్తి వివరాలు క్షణాల్లో తెలుస్తాయి.