అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వేశాఖ

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

దసరా, దీపావళి, కార్తీక మాస పండగల వేళ అరుణాచలం వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసాపురం – తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 30 వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, కాట్పాడి మీదుగా ఈ రైళ్లు ప్రయాణించనుండగా, భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు రిజర్వేషన్లను కూడా ప్రారంభించారు.