సర్వేపల్లిలో సీఎంఆర్ఎఫ్ వరం: రెండేళ్లలో పది కోట్లకు పైగా ఆర్థిక సాయం

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

సర్వేపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రికార్డు స్థాయిలో పేదలకు ఆర్థిక సాయం అందుతోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ సంజీవనిలా మారిందని కొనియాడారు. నియోజకవర్గంలో వైద్య సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, సీఎస్ఆర్ నిధులతో డయాలసిస్ కేంద్రాలు, ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.