వంశధార నాగావళి ప్రవాహంపై శ్రీకాకుళం కలెక్టర్ హెచ్చరిక
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి నదుల్లోకి 65,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నది ప్రవాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గణేష్ నిమజ్జనోత్సవంలో యువత తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ హెచ్చరించారు.