లక్నో రైల్వే స్టేషన్లో భారీ బంగారం పట్టివేత: కోటి డెబ్బై లక్షలు సీజ్
రిపోర్టర్: రమేష్
స్థలం: లక్నో
లక్నో రైల్వే స్టేషన్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న కోటి డెబ్బై లక్షల రూపాయల విలువైన విదేశీ బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ఫాంపై తనిఖీలు నిర్వహించి ఒక ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు డీఆర్ఐ అధికారులు శుక్రవారం వెల్లడించారు. హౌరా నుంచి వారణాసి మీదుగా లక్నోకు ఈ బంగారం తరలిస్తున్నట్లు గుర్తించి కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.