రాజకీయ వ్యాఖ్యల కారణంగానే సినిమాల్ లో అవకాశాలు తగ్గాయంటూ ప్రకాష్ రాజ్ భార్య వెల్లడి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
దేశంలో జరుగుతున్న రాజకీయ మరియు సామాజిక పరిణామాలపై నటుడు ప్రకాష్ రాజ్ నిర్మొహమాటంగా స్పందించడం వల్లే ఆయనకు సినిమా అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని ఆయన సతీమణి, ప్రముఖ నృత్య దర్శకురాలు పోనీ వర్మ వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ ఆలోచనా విధానంలో పూర్తి మార్పు వచ్చిందని, భయంతో మౌనంగా ఉండటం మానేసి ప్రజా సమస్యలపై గళం విప్పడం ప్రారంభించారని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.