విజయనగరం జీజీహెచ్లో బ్రాండెడ్ మందుల దందా: రోగులకు తప్పని కొనుగోళ్ల భారం

రిపోర్టర్: నరేష్ స్థలం: Vizianagaram

విజయనగరం మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉచిత మందుల కొరత వేధిస్తోందని, జాబితాలో లేని బ్రాండెడ్ మందులను వైద్యులు రాస్తుండటంతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈఎన్టీ, డెర్మటాలజీ విభాగాల్లో బయట దుకాణాలతో కుమ్మకై ఇలా చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన మందులు సరఫరా చేస్తున్నా, కొందరు వైద్యుల తీరు వల్ల పేద రోగులకు తీవ్ర భారంగా మారుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ తెలిపారు.