చర్చకు రావాలంటూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సవాల్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
తనతో చర్చకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సవాలు విసిరి ఇరవై నాలుగు గంటలు గడిచిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రతిపక్షం దేశద్రోహి అంటూ మోదీ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ వేదికైనా, ఏ సమయమైనా బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, భయపడకుండా చర్చకు రావాలని మోదీకి సవాల్ విసిరారు. ఆర్థిక వ్యవస్థ, విదేశీ ఒప్పాదాలపై నిజాలు నిగ్గు తేలుస్తామని రాహుల్ పేర్కొన్నారు.