ముంబై కోస్టల్ రోడ్డుపై ఘోర ప్రమాదం మూడు కార్లు ధ్వంసం ముగ్గురు విద్యార్థులు మృతి

రిపోర్టర్: శివ స్థలం: Mumbai

ముంబైలోని కోస్టల్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకెళ్లిన బిఎండబ్ల్యూ కారు అదుపుతప్పి అండర్ కన్స్ట్రక్షన్ పార్కింగ్ స్థలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మృతులను అహ్మదాబాద్‌కు చెందిన సనయ్ గుజార్, ఆదిత్య జకాస్నియా మరియు మరో మైనర్‌గా పోలీసులు గుర్తించారు. జుహులోని ఎన్ఎంఐఎంఎస్ కళాశాలలో చదువుతున్న వీరంతా మెరైన్ డ్రైవ్ వైపు వెళ్తుండగా లోటస్ జెట్టీ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.