ఇచ్చాపురం పలాస మున్సిపల్ పోరులో పోస్టల్ బ్యాలెట్లదే కీలక పాత్ర

రిపోర్టర్: JR RAO స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మరియు పలాస మున్సిపాలిటీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారాయి. ఇచ్చాపురంలో ఇరవై ఎనిమిది వార్డులు, పలాసలో ముప్ పై ఆరు వార్డులకు నవంబర్ మొదటి తేదీన పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉన్న తరుణంలో, ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు వేసిన పోస్టల్ బ్యాలెట్లు ఎవరి వైపు మొగ్గు చూపుతాయనే ఉత్కంఠ తీవ్రంగా నెలకొంది.