అమెరికాలో భార్య హత్య కేసులో గాయకుడు కాలేబ్ ఫ్లిన్ దోషి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Tipp City, Ohio
అమెరికాలోని ఒహియోలో సంచలనం సృష్టించిన భార్య హత్య కేసులో మాజీ మ్యూజిక్ పాస్టర్ కాలేబ్ ఫ్లిన్ను జ్యూరీ దోషిగా నిర్ధారించినట్లు అధికారులు వెల్లడించారు. తిప్ సిటీకి చెందిన ముపది ఏళ్ల కాలేబ్ ఫ్లిన్ తన భార్య యాష్లే ఫ్లిన్ను గృహ చొరబాటు నాటకమాడి కాల్చి చంపినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టులో నిరూపించారు. అక్రమ సంబంధం, లక్షకు పైగా టెక్స్ట్ మెసేజ్లు, డిజిటల్ ఆధారాలను పరిశీలించిన కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.