గిరిజన యువకుడి ఆత్మహత్య కేసును నీరుగారేసేలా కాంగ్రెస్ నేత ఈశ్వరమ్మ సెటిల్మెంట్ యత్నం
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
హైదరాబాద్లోని ఎల్బీనగర్లో బైక్ వివాదం కారణంగా గిరిజన యువకుడు రాజేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనలో కాంగ్రెస్ నేత పోచబోయిన సురేశ్ యాదవ్ వేధింపులే కారణమని ఆరోపణలు రాగా, ఆయనను కాపాడేందుకు ఆయన నాయకురాలు, దేవస్థానం బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్ మృతుడి తల్లితో సెటిల్మెంట్కు యత్నించిన ఆడియో వైరల్ కావడంపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.