ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఉచిత దర్శనం

రిపోర్టర్: శివ స్థలం: Vijayawada

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు ఉచితంగా దుర్గమ్మ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆలయ పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆర్జిత సేవా టికెట్లను అధికారికంగా విడుదల చేశారని, భక్తులు ఆన్లైన్లో వీటిని బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.