స్థానిక సంస్థల అప్డేట్: ఈనెల 23న మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, పురపాలక ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈనెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించిన నూతన ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎస్ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి.