ఓజోన్ పరిరక్షణపై కర్నూలులో విద్యార్థుల భారీ ర్యాలీ

రిపోర్టర్: అశోక్ స్థలం: కర్నూలు

ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కర్నూలులో మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏ. క్యాంప్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు ప్రకృతి పరిరక్షణపై నినాదాలు చేశారు. ఓజోన్ పొర విశిష్టతను, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యతను అందరికీ వివరించారు.