భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
రిపోర్టర్: శివ
స్థలం: Dubai
ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన కాక్‌పిట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడి కోలుకుంటున్నారని యూఏఈలోని భారత రాయబారి దీపక్ మిట్టల్ తెలిపారు. గురువారం ఆస్పత్రిలో మచ్చర్‌ను కలిసి పరామర్శించిన మిట్టల్, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని, ఆయన ధైర్యసాహసాలకు దేశం గర్విస్తోందని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.