దిల్లీలో మహిళా విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం: రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న మహిళలు మరియు విద్యార్థినులపై దిల్లీ పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారి గొంతును నొక్కేసేందుకే అధికార వర్గాలు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎవరినీ లేవనెత్తలేనంతగా భయభ్రాంతులకు గురిచేసే కుయుక్తులు ఎప్పటికీ సాగవని హెచ్చరిస్తూ, బాధితులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.