కర్ణాటకలో బయటపడ్డ పురాతన బంగారు నాణేల నిధి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బెళగావి

కర్ణాటకలోని బెళగావి జిల్లా ఇంచల్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా కూలీలకు 14 పురాతన బంగారు నాణేలు లభించాయి. సుమారు 800-1000 ఏళ్ల నాటి ఈ నాణేల విలువ రూ.8.20 లక్షలు ఉంటుందని అంచనా. ఆశపడకుండా నిజాయితీగా నాణేలను అధికారులకు అప్పగించిన కూలీలను గ్రామస్థులు, అధికారులు ప్రశంసించారు. ప్రస్తుతం ఈ నాణేలను తాలూకా ఖజానాకు తరలించి, పురావస్తు శాఖ పరిశీలనకు సిద్ధం చేశారు.