పాలకొండలో సమస్యల పరిష్కారమే లక్ష్యమంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి మోహనరావు ముమ్మర ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ రెండో వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి కిల్లరి మోహనరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు వెలమల మన్మథరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తనను గెలిపిస్తే వార్డులోని సమస్యలను పరిష్కరిస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మోహనరావు హామీ ఇచ్చారు.