పుస్తకం కొంటే రూ.10 కోట్ల బహుమతి గెలిచే అవకాశం!
రిపోర్టర్: గోపి
స్థలం: World
ప్రముఖ యూట్యూబర్ మిస్టర్బీస్ట్, రచయిత జేమ్స్ ప్యాటర్సన్తో కలిసి 'ది మోస్ట్ డేంజరస్ గేమ్స్' అనే నవలను విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసిన పాఠకులకు 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10 కోట్లు) గెలుచుకునే ప్రత్యేక పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. పుస్తకం కథ కూడా భారీ నగదు బహుమతి కోసం జరిగే పోటీ చుట్టూనే తిరుగుతుండటం విశేషం. ఈ సరికొత్త ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.