కోరుకొండ సైనిక్ స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపల్ గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్. శాస్త్రి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుడు పి.శ్రీనివాసరావుకు గ్రంధి కామరాజు స్మారక పురస్కారాన్ని అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు చేస్తున్న నిరంతర కృషిని, సేవలను ప్రిన్సిపల్ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.