స్మార్ట్ పోలీసింగ్‌తో డిజిటల్ నేరాలను అరికట్టాలని మంత్రి సవిత పిలుపు
రిపోర్టర్: మహేష్
స్థలం: అనంతపురం
మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టేలా ప్రతి పోలీసు స్మార్ట్ పోలీసుగా మారాలని రాష్ట్ర మంత్రి సవిత పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరు 14వ బెటాలియన్‌లో జరిగిన శిక్షణ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలను ఓర్పుతో విని పరిష్కరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను పన్నెండు వేలకు పెంచామని స్పష్టం చేశారు.