నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

రిపోర్టర్: అశోక్ స్థలం: Nampally, Hyderabad

తెలంగాణ డిజిపి సి.వి. ఆనంద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర చరిత్రలో ఈ వేడుకల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.